అనంతపురం జిల్లా.
– అనంతపురం నగరంలోని పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతులమీదుగా దివ్యాంగులకు 4 మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. ఎంపీ నిధుల నుంచి ఈ మూడు చక్రాల వాహనాలను దరఖాస్తు చేసుకున్న నలుగురు దివ్యాంగులకి శుక్రవారం ఎంపీ అంబికా బండి తాళాలు ఇచ్చి, స్వీట్ పంచి వారి చేతికి వాహనాలు అందజేశారు. ఈ మూడు చక్రాల వాహనాలు అందుకున్న వారిలో షేక్ నబీ సాబ్, హరినాథ్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీనాథ్ రెడ్డి అనే నలుగురు దివ్యాంగ లబ్ధిదారులు ఉన్నారు.
– షేక్ నబి సాబ్ అనే లబ్ధిదారుడు మాట్లాడుతూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకి మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మా ఆర్థిక పరిస్థితిని గమనించి దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ మూడు చక్రాల వాహనం అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
– ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన, సూపరింటెండెంట్ అనిల్, సిఆర్ఓ నాగమోణి, తదితర ఎంపీ ఆఫీస్ సిబ్బంది, దివ్యాంగుల సంక్షేమ శాఖ సిబ్బంది, ఇతర దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
