తాడిమర్రిలో వ్యవసాయ సమీక్ష: ‘ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్’పై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశం!

తాడిమర్రి (yes9tv)మండలంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహణ
తాడిమర్రి మండలంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి శేఖర్ నాయక్ మాట్లాడుతూ వర్షాకాలానికి ముందు పొడి విత్తనాలు వేయడం (ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్) గురించి వివరించారు. వివిధ పంటలపై అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేయాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.
అదేవిధంగా వ్యవసాయంలో డ్రోన్ సాంకేతిక వినియోగం పై కూడా చర్చించారు. రైతులు ఏపీ రైతు నమోదు (APFR) పూర్తి చేసుకోవాలని, అలాగే ఏపీఏఐఎం మొబైల్ అప్లికేషన్ (APAIM యాప్) వినియోగంపై అవగాహన కల్పించాలని ఆర్‌ఎస్‌కే సిబ్బందికి సూచనలు చేశారు.
భూగర్భ జలాల సంరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న జలధార – జలహారతి పథకం కింద ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో కనీసం పది ఫార్మ్ పాండ్‌లను గుర్తించాలని సూచించారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, తక్కువ వర్షపాతం పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ శాఖ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని సూచించారు.
ఈ సందర్భంగా మండలంలో గత సంవత్సరం నుండి విశిష్ట సేవలు అందించిన శ్రీమతి శ్రీవాణి గారు కదిరికి బదిలీ కావడంతో, ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ వైష్ణవి, వ్యవసాయ సహాయకులు మరియు ఏపీ సీఎన్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Posted Under AP
Editor