తాడిమర్రి(yes9tv)
భారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు గోరంట్ల మోహన్ శేఖర్ శర్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నార్సింపల్లి గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు చిత్ర సూరి గారి ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు దేవర రామ్మోహన్ గారు, వైస్ ఎంపీపీ కృష్ణం నాయుడు గారు పాల్గొని వృద్ధాశ్రమంలో నివసిస్తున్న 24 మంది వృద్ధ మహిళలకు చీరలు, 7 మంది పురుషులకు పంచలు మరియు టవళ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మిఠాయిలను కూడా పంచి వృద్ధుల ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయుడు గారు, గొంది రవీంద్ర గారు, ప్రసాద్ గారు, డి. వెంకట రాముడు గారు, బాబు గారు, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు చెంచుగొల్ల రామాంజనేయులు గారు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు గంగయ్య గారు, పుల్లన్న గారు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గోరంట్ల మోహన్ శేఖర్ శర్మ గారు ప్రజల పట్ల ప్రేమాభిమానాలు కలిగిన నాయకుడని, ఆయన పుట్టినరోజును సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు.
గోరంట్ల మోహన్ శేఖర్ శర్మ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం..
