ముదిగుబ్బ యస్ 9
కేంద్రమైన ముదిగుబ్బలో కస్తూరిబాయ్ కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది,
శుక్రవారం ఉదయం ఉరవకొండ డిపోకు చెందిన తిరుపతి ఎక్స్ ప్రెస్ బస్సు అనంతపురం వైపు నుంచి వస్తూ ముదిగుబ్బ వద్ద స్థానిక కస్తూరిబాయ్ కాలనీ సమీపంలో 42 వ జాతీయ రహదారిపై ముదిగుబ్బ వైపు వెళ్తున్న వాటర్ ట్యాంకును బస్సు వెనకనుంచి బలంగా ఢీకొంది, ఈ సంఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని బస్సు డ్రైవర్ వెంకటేష్ తీవ్ర గాయలతో బస్సు లోనే ఇరుక్కుపోయాడు, దీంతో బస్సు ఇంజన్ లో ఇరుకుపోయిన డ్రైవర్ను బయటకు తీయడానికి స్థానికులు చాలా ఇబ్బంది పడ్డారు, అనంతరం డ్రైవర్ ను చికిత్స నిమిత్తం 108అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు, కాగా ఈ సంఘటనలో బస్సు డ్రైవర్కు తప్ప మిగతా ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం లేకపోయినా కూడా
ఈ సంఘటనతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైనట్టు తెలిసింది, ఈ విషయం తెలిసిన వెంటనే ముదిగుబ్బ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు,
ముదిగుబ్బ వద్ద రోడ్డు ప్రమాదం: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్!
