చిల్లకొండయ్యపల్లి గ్రామంలో శ్రీ కొరమీశాల పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహణ
తాడిమరి మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో ఆరవేటి దామోదర్ అర్చకుడు నూతనంగా నిర్మించిన శ్రీ కొరమీశాల పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా శ్రీ ఆరవేడు పట్నం పెద్దయ్య స్వామి హాజరై భక్తులకు ఆశీర్వాదాలు అందించారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా కట్టెల కోలాటం నిర్వహించి కార్యక్రమాన్ని ఉత్సాహంగా, ఆనందభరితంగా జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
చిల్లకొండయ్యపల్లిలో ఘనంగా శ్రీ కొరమీశాల పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట: భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం!
