అనంతపురం జిల్లా,రామ్‌నగర్.
*“ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహణ”*
*అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన “ప్రజాదర్బార్” కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు పాల్గొన్నారు.*
*ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, నాయకులు తమ సమస్యలను మంత్రివర్యులకు తెలియజేశారు. మంత్రి స్వయంగా వారి సమస్యలను శ్రద్ధగా విని వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.*
*ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తమ ప్రభుత్వానికి అభివృద్ధి మరియు సంక్షేమం రెండూ సమానంగా ముఖ్యమని, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రివర్యులు పేర్కొన్నారు*.
