Latest Posts

ఏసీబీ అధికారిగా నటిస్తూ తహశీల్దార్‌ను బెదిరించిన కేటుగాడు అరెస్ట్: రూ.50 లక్షల వసూలు కేసును ఛేదించిన పోలీసులు!

సత్య సాయి జిల్లా…

ధర్మవరం నియోజకవర్గం

కటకటాలు పాలైన కేటుగాడు…
ఏసీబీ అధికారిగా నటిస్తూ తాసిల్దార్‌ను బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేసిన
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో..ఈ కేసును సుదీర్ఘంగా విచారణ చేసి ఛేదించిన ముదిగుబ్బ సిఐ శివరాముడు

పోలీసుల వివరాల ప్రకారం…

అనంతపురం జిల్లా కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన ఎరుకల హనుమంతు 2021 సంవత్సరంలో తనను ఏసీబీ అధికారిగా ఫోన్లో పరిచయం చేసుకుని, ముదిగుబ్బలో తాసిల్దార్‌గా పనిచేస్తున్న అన్వర్ హుస్సేన్‌ను ఫోన్ ద్వారా బెదిరించాడు. అవినీతి కేసులు పెట్టిస్తానని భయపెట్టి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైనా, నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో ఈ కేసును సవాలుగా తీసుకున్న సిఐ శివరాముడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలు మరియు గోప్య సమాచారంతో నిందితుడి కదలికలను గమనించారు.
దీంతో, ఏప్రిల్ 4, 2026న నిందితుడు ఎరుకల హనుమంతును పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.
ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సిఐ శివరాముడు మరియు వారి బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని మరింత పెంచేలా ఈ అరెస్ట్ నిలిచిందని పేర్కొన్నారు.

Posted Under AP
Editor