Latest Posts

రేషన్ దుకాణాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: అనంతపురంలో జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

అనంతపురం జిల్లా.

అనంతపురము పట్టణములోని నవోదయ కాలని యందు గల చౌక దుకాణం నెంబర్ 10 3 ను జిల్లా సంయుక్త కలెక్టర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో కార్డుదారులతో మాట్లాడి డీలరు నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయుచున్నాడా, అందుబాటులో ఉంటున్నాడా, ప్రతిరోజు ప్రభుత్వం నిర్ణయించిన వేళలు ప్రకారము షాపు తీయుచున్నాడా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధముగా ఎండలు మరియు వడగాలులు ఉన్నందు వలన కార్డుదారులు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మరల సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే చౌక దుకాణము వద్దకు వచ్చి నిత్యావసర సరుకులు పొందవలయునని తెలియజేసినారు. అదే విధంగా చౌక దుకాణ డీలర్లందరూ కార్డుదారులకు సరైన తూకముతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయవలయునని తెలియజేసినారు. 65 సంవత్సరముల పైబడిన వృద్ధులు, వికలాంగులు మరియు మంచానికి పరిమితమైన వారు ఎవరు కూడా సరుకులు కొరకు చౌక దుకాణము వద్దకు రాకూడదని చౌక ధరల దుకాణ డీలర్లు కార్డుదారుల ఇంటి వద్దకే వచ్చి వారికి కేటాయించిన సరుకులు అందజేస్తారని తెలియజేశారు. అందరూ చౌక దుకాణ డీలర్లు వారి రేషను షాపుల వద్ద త్రాగునీటి వసతి, నీడ అవసరమైన అన్ని వసతులు కల్పించాలని కార్డుదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకునవలేనని తెలియజేసినారు. చౌక ధరల దుకాణ డీలర్లు విధిగా రేషను షాపుల వద్ద ఉండి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని తెలియజేసినారు. ఎవరైనా డీలర్లు అవకతవకలకు పాల్పడినా పంపిణీ సమయంలో కార్డుదారులకు అసౌకర్యాలు కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకొనబడునని తెలియజే సినారు. పట్టణములో గల అన్ని చౌక ధరల దుకాణ డీలర్లు సక్రమముగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయునట్లుగా పర్యవేక్షించవలయునని పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దారు అర్బన్ వారిని ఆదేశించడమైనది. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టరు వారి వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి టి వెంకటేశ్వర్లు, సి. యస్. డి. టి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Posted Under AP
Editor