ముదిగుబ్బ మండలం లోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకస్తూ నిరసన కార్యక్రమం ముదిగుబ్బ అంగన్వాడీ సెంటర్ దగ్గర చేయటం జరిగింది…
సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ అనగన్వాడీ లకు కనీస వేతనం అమలు చెయ్యలేదు,ఉద్యోగ భద్రత లేదు, అదేవిదంగా వేసవి సెలవులు మే నేలా అంతా ఇవ్వాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చారు కానీ వారికీ జీతాలు పెంచలేదు… అదేవిదంగా ఒక రోజు ధర్నా కార్యక్రమం చేసినందుకు అంగన్వాడీ లకు రెండు రోజులు జీతం 1000 కోత విధించారు… ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయటం జరిగింది…
ఈ కార్యక్రమంలో సిఐటియు ముదిగుబ్బ మండల కార్యదర్శి బాబ్జాన్ కో కన్వీనర్ ఓబులేసు అంగన్వాడి నాయకురాలు రజియా శ్రీదేవి మరియు అల్లా బకాష్ అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొ నడం జరిగింది
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్,సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…
