తాడిమర్రి(yes9tv) తాడిమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన 8 మంది ANMs మరియు LDCగా సేవలందించి బదిలీపై వెళ్లిన సిబ్బందికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఫైరోజా బేగం గారు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నాగేంద్ర నాయక్ గారు, డీఎంఓ డాక్టర్ చెన్నారెడ్డి గారు, పిహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిత గారు, గోవర్ధన్ నాయుడు గారు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
బదిలీపై వెళ్లిన ANMs అయిన కృష్ణమ్మ, రత్నమ్మ, సౌదామిని, లక్ష్మీకాంతమ్మ, గాయత్రి, సుగుణమ్మ, కె.పీ. సావిత్రమ్మ, భారతి గార్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు. వారి సేవలు ఆరోగ్య రంగానికి ఎంతో మేలుచేసినవని అతిథులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని బదిలీపై వెళ్లిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
తాడిమర్రి పీహెచ్‌సీలో బదిలీపై వెళ్తున్న ఏఎన్ఎంలు, సిబ్బందికి ఘనంగా సన్మానం: పాల్గొన్న డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం
