అనంతపురం జిల్లా, కలెక్టరేట్.
*ప్రైమరీ సెక్టార్ పై జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సమీక్ష..*
అనంతపురం, మార్చి 31 :
– *అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల అధికారులతో (ప్రైమరీ సెక్టార్) పై జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ముందుగా గత ప్రైమరీ సెక్టార్ సమావేశంలో చర్చించిన అంశాలపై వివిధ శాఖ అధికారులు తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ సమీక్షించారు.*
– *ఇందులో వ్యవసాయ శాఖలో ప్రస్తుతం అములు అవుతున్న పథకాల ప్రగతి గురించి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ APFR (రైతు రిజిస్ట్రేషన్)లో ఇంకా ఎవరైనా రైతులు మిగలి ఉంటే వారిని కూడా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపిఎంఐపి ద్వారా ఇప్పటి వరకు మంజూరైన డ్రిప్ పరికరాలను పంపిణీ చేసి వాటిని ఇన్స్టాలేషన్ చేసి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. డ్రిప్ ద్వారా ఎరువుల నీటిపారుదల (ఫర్టిగేషన్) చేయడం వల్ల రైతులకు ఖర్చు తగ్గించి అధిక దిగుబడులు పొందడానికి అవకాశం వుంది కాబట్టి కెవికె శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని, తద్వారా పంటల వారిగా రైతులను గుర్తించి వారికి ఈ నీటిపారుదల మీద శిక్షణ కార్యక్రమం నిర్వహించి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏపిఎంఐపి పిడిని ఆదేశించారు.*
– *ఆత్మ ద్వారా నూతన సాంకేతిక పద్ధతులను గుర్తించి రైతులకు చేరే విధంగా శిక్షణా కార్యక్రమాలను మరియు చైత్ర ప్రదర్శనను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు గుర్తించిన అగ్రిస్టార్టప్ కంపెనీలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి వారి విధానాలు రైతులకు తెలియజేయాలన్నారు. కొత్త వాటిని గుర్తించి వాటిని కూడా క్షేత్ర స్థాయిలో రైతులకు తెలపాలన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ద్వారా నిర్వహించే గోడౌన్లను మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా నిర్మించిన MPFC గోడౌన్ లను వాడుకలో తీసుకురావాలని మార్కెటింగ్ ఏడి, డిసిఓలను ఆదేశించారు.*
– *సెరికల్చర్ పరిధిలో సాగు చేస్తున్నటువంటి పంటల విస్తీర్ణంలో 6,000 ఎకరాలలో ఏపిసిఎన్ఎఫ్ పద్ధతుల ద్వారా సాగు చేసే విధంగా రైతులలో అవగాహన కల్పించి మంచి దిగుబడి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సెరికల్చర్ అధికారిని ఆదేశించారు. జిల్లాలో జల సంరక్షణలో భాగంగా డ్వామా పిడి, సూక్ష్మ నీటిపారుదల శాఖ, హెచ్.ఎల్.సి, హెచ్ఎన్ఎస్ఎస్, వ్యవసాయ శాఖ జెడి, జిల్లా ఉద్యాన అధికారి, మరియు ఏపిఎంఐపి పిడి వారు కలిసి జల సంరక్షణ విధివిధానాలపై ప్రణాళికను తయారు చేసుకుని వాటిని క్షేత్రస్థాయి అధికారులకు తెలియజేసి గ్రామస్థాయిలో చర్చలు జరపవలసిందిగా ఆదేశించారు. అలాగే వాటిని వివిధ శాఖల ద్వారా అమలవుతున్నటువంటి పథకాల ద్వారా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేస్తున్న ఆత్మ పిడిని శాలువా కప్పి జిల్లా కలెక్టర్ సన్మానించారు.*
– *ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, నాబార్డు ఏజీఎం అనురాధ, మార్క్ఫెడ్ డిఎం పెన్నేశ్వరి, పశుసంవర్ధక శాఖ జెడి ప్రేమ్ చంద్, డిసిఓ అరుణ కుమారి, ఆత్మా పీడీ పద్మలత, హెచ్.ఎల్.సి ఎస్ఈ సుధాకర్ రావు, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*
