Latest Posts

తెల్లవారుజామునే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ: వైద్య సేవలపై సంతృప్తి

అనంతపురం జిల్లా.

*మరోసారి ఎమ్మెల్యే దగ్గుపాటి ఆకస్మిక తనిఖీలు*

– *: తెల్లవారుజామున 5 గంటలకే ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు*

– *: 2 గంటలపాటు ఆసుపత్రి మొత్తం కలియతిరిగిన ఎమ్మెల్యే*

– *: రోగుల నుంచి కంప్లైంట్లు నిల్.. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఎమ్మెల్యే సంతృప్తి*

అనంతపురం, మార్చి 31 :

– అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరోసారి ఆకస్మిక తనిఖీలు చేశారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకే ఆయన అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండు గంటల పాటు ఆసుపత్రి మొత్తం కలియతిరిగారు. ఎమ్మెల్యే దగ్గుపాటి రాకతో వైద్యులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుగా ఆయన ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. రోగులు వారి అటెండర్లతో మాట్లాడారు. వైద్యులు బాగా స్పందించారా..? మీరు వచ్చిన ఎంతసేపటికి అడ్మిట్ చేసుకున్నారు…? వంటి అంశాల గురించి కూలంకశంగా తెలుసుకున్నారు. అనంతరం ఆర్థో, గైనిక్, ఎంఎస్, ఎఫ్.ఎస్ వార్డులను పరిశీలించారు. రోగులు వారి అటెండర్లతో మాట్లాడారు. వైద్యులు స్పందిస్తున్నారా, మందులు సకాలంలో ఇస్తున్నారా, నర్సులు ఇతర సిబ్బంది పనితీరు ఎలా ఉంది వంటి అంశాల గురించి ఆరా తీశారు. రోగులు వారి అటెండర్ల నుంచి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తమైంది. దీనిపై ఎమ్మెల్యే దగ్గుపాటి కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రి కేవలం 560 పడకలకు మాత్రమే ఉందని..కానీ ఇక్కడ 1200 మందికి పైగా ఇన్ పేషంట్లకు సేవలందిస్తున్నారన్నారు. అలాగే 2000 నుంచి 2500 మంది ఓపి ఉందన్నారు. ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ వైద్యులు ఎక్కడా రాజీ పడకుండా సేవలందిస్తున్నారన్నారు. రోగుల నుంచి ఎక్కడా ఫిర్యాదులు లేవన్నారు. ఏసీలు పనిచేయడం లేదు,కొన్ని మందులు లేవన్న విషయం తమ దృష్టికి వచ్చిందని.. వెంటనే మందులు కొనుగోలు ఇండెంట్ పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఏసీల మరమ్మతులు కూడా చేయడంతో పాటు కొత్త ఏసీలు కొనుగోలుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. ప్రస్తుతం కొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయని.. వాటిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ని కోరుతామని దగ్గుపాటి చెప్పారు. మరోవైపు సూపరింటెండెంట్ మల్లీశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలో తమ పనితీరు ఎలా ఉందని తెలుసుకోవాలంటే ఆకస్మిక తనిఖీ ద్వారానే అది సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ఇలా తనిఖీలు చేయడం ద్వారా వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగులు వారి అటెండర్లు పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారని ఆమె తెలిపారు..

Posted Under AP
Editor