అనంతపురం జిల్లా, రాయదుర్గం.
పేదరికం లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి
మనమంతా పరస్పరం చేతులు కలిపితేనే పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు.
రాయదుర్గం పట్టణంలోని నియోజకవర్గ విజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నో ప్రావర్టీ 4 మొదటి వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకువచ్చేలా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్ర భుత్వం ప్రయత్నిస్తోందన్నారు. స్థితిమంతులు, పారిశ్రామిక వేత్తలు, ఉన్నంతలో ఇతరులకు కాస్త సహాయం చేయాలన్న సేవా తత్పరుల స్వచ్చంద సహకారంతో సమాజంలోని నిరుపేదలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఆయన పీ 4 విధానాన్ని అమలు చేస్తున్నాం “న్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఓ ఆదర్శవం తమైన మార్గాన్ని చూపే దిశగా ఏడాది క్రితం ప్రారంభించారన్నారు. రాయదుర్గం నియోజకవర్గం లో క నాడా దీన్ని దాతల సహకారంతో చేపట్టామన్నారు. అయితే ఇంకా విస్తృతం కావాలన్నారు. పేదరికం నుండి బయటకు తీసుకురావాలన్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఒకరి కష్టాల్లో ఒకరు భాగం పంచుకోవడం ద్వారా ఆ కుటుంబానికి ఎంతో మేలు చేకూర్చిన వారు అవుతారన్నారు. ఇబ్బంద ఎల్లో ఉన్నవారికి సకాలంలో సహకారం అందిస్తే, జీవితకాల ౦ వారు గుర్తు పెట్టుకుంటారన్నారు. ఇతరుల సహకార ౦తో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించిన వారవుతార న్నారు. ఆ విధంగా పేద కుటుంబాలను దత్తత తీసుకోవ డానికి చేయూత అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప ట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, మండల కన్వీనర్ కురుబ హనుమంతు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ హను మంత రెడ్డి, కార్పోరేషన్ డైరెక్టర్ పోరాళ్ల పురుషోత్తం, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ టకశాల హనుమంతు,జిల్లా అధికా రప్రతినిది పసుపులేటి నాగరాజు,రావుత్ రాజశేఖర్, జీలాన్, కావలి రవి, పాల్గొన్నారు.
