తెలుగుదేశం పార్టీ జెండా… టిడిపి కార్యకర్తకు అండ
ప్రమాదవశాత్తు మరణించిన కిష్టప్ప కుటుంబానికి ఐదు లక్షల బాండు
శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం కొండ్రవారిపల్లికి చెందిన టిడిపి కార్యకర్త నరసపు కిష్టప్ప గారు హైదరాబాద్ లో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో నరసపూ కిష్టప్ప మరణించడం జరిగింది. ఆ కుటుంబం టిడిపి పార్టీ సభ్యత్వం పొందడం వల్ల ఆ కుటుంబానికి ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలను బాండ్లను తక్షణమే పార్టీ పంపడం జరిగింది, 5 లక్షల బాండు ను ఎమ్మెల్యే పల్లె సింధూర మేడం ఆదేశాలతో టీడీపీ పార్టీ కన్వీనర్ మైలే శంకర్ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అందించడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త టీడీపీ పార్టీ సభ్యత్వం చేయడానికి అలసత్వం చేయకుండా ప్రతి ఒక్కరు సభ్యత్వం చేసుకోవాలని, అవగాహన లేని వారికి తెలియజేసి టిడిపి సభ్యత్వం చేయించాలని ప్రతి కార్యకర్తను కోరడమైనది,
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు మరణించిన టిడిపి కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల బీమా బాండ్ అందజేత
