తాడిపత్రి నియోజకవర్గంలో వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని వివరించారు.
అదేవిధంగా, మైనర్ బాలబాలికలు బైక్ నడపడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ వయసు ఉన్న వారు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, సదరు బైకులను తక్షణమే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు గురి చేయవద్దని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా ఉండాలని ఈ సందర్భంగా ఏఎస్పీ సూచించారు.
