Latest Posts

అనంతపురం జీజీహెచ్‌కు మోబిస్ ఇండియా చేయూత: మార్చురీ విభాగానికి డీప్ ఫ్రీజర్లు వితరణ!

అనంతపురం జిల్లా.

*జిజిహెచ్ ఫోరెన్సిక్ మెడిసిన్ మార్చురీ విభాగానికి డీప్ ఫ్రీజర్ వితరణ*

– *: మోబిస్ ఇండియా సేవలను అభినందించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*

అనంతపురం, మార్చి 28 :

– *అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శనివారం ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ ఫ్రీజర్ల సదుపాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోబిస్ ఇండియా అధినేతలు జిజిహెచ్ లోని మార్చురీ విభాగానికి అవసరమయ్యే డీప్ ఫ్రీజర్ లను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద అందించారని, మరింతమంది దాతలు ముందుకు వచ్చి జిల్లా పెద్దాసుపత్రి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలిపారు. జిల్లా వాసులకు ఫోరెన్సిక్ సేవలను సమర్థవంతంగా అందిస్తున్న డిపార్ట్మెంట్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ డి.మల్లేశ్వరి, ఫారెన్సీక్ మెడిసిన్ విభాగాధిపతి ఆచార్య డాక్టర్ శంకర్, ఈ కార్యక్రమంలో మోబిస్ ఇండియా అధినేతలు పిఎన్. శ్రీనివాస్, సింధూజలను జ్ఞాపికలతో శాలువా తో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిజిహెచ్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునరెడ్డి, ఫోరెన్సిక్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాలేటి చంద్రశేఖర్, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, ఆలంబన జనార్ధన్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఓలేటి రత్నమయ్య, ఫోరెన్సిక్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పి విష్ణువర్ధన్, డాక్టర్ వినీల్ రాజ్, డాక్టర్ భార్గవ రాజు తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor