Latest Posts

చిన్నముస్తూరులో విషాదం: అప్పుల బాధ తాళలేక కౌలు రైతు బోయ సురేష్ ఆత్మహత్య

అనంతపూర్ జిల్లా ఉరవకొండ మండలం చిన్నముస్టురు గ్రామానికి చెందిన రైతు బోయ సురేష్ వయసు 35 అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు వృత్తిని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు చిన్న ముస్తూరు గ్రామానికి చెందిన బోయ సురేష్ తీసుకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు రెండేళ్లుగా వేరుశనగ కంది ఇతర పంటలు సాగు చేశాడు పంటకు గిటుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక తీవ్ర నష్టాలు చావే చూసాడు బయట వ్యక్తుల వద్ద బ్యాంకుల్లో చేసిన అప్పులు సుమారు పది లక్షల నుండి 12 లక్షలు చేరడంతో వీటికి ప్రతినెలా వడ్డీ చెల్లించడం భారంగా మారింది. దీంతో అప్పులు తీర్చే మార్గం లేదని ఆవేదన చెందుతూ ఉండేవాడు ఈ నేపథ్యంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మృతునికి భార్య సునీతతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. మృత్రుడు బోయ సురేష్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రైతు విభాగం ఉరవకొండ నియోజకవర్గం రైతు విభాగం అదేక్షలు మేకల సిద్ధప్ప,మాశినేని సుభ్రమణ్యం చిన్న ముష్టుర్ రైతు అదేక్ష్యులు,,బోయ చిన్నమళ్లప్ప బీసీ అదేక్ష్యులు,,ముష్టుర్ సర్పంచ్ రామాంజినేయులు,,,ముష్టుర్ బాబు,,మారుతీ తెలియజేశారు.

Posted Under AP
Editor