అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం
వేగం, నిర్లక్ష్యం.. ఒకరి ప్రాణం బలి
-గోనేహాళ్ క్రాస్ సమీపంలో ఐచర్, బైక్ ఢీ
ఘోర రోడ్డు ప్రమాదం
ఒకరు మృతి. 14 మందికి గాయాలు
అతి వేగం, నిర్లక్ష్యం కలిసి ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొన్న ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం గోనేహాళ్ క్రాస్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 14 మందికి గాయాలు కాగా ఆసుపత్రి పాలయ్యారు. స్థానికులు, బొమ్మనహాళ్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు బొమ్మనహాళ్ మండలంలోని గౌనూరు గ్రామానికి చెందిన ఉప్పర వీరేష్ (20) పత్తి పొలంలో పనులు చూసుకుని ద్విచక్రవానంపై రోడ్డుపైకి వస్తుండగా, కణేకల్లు క్రాస్ వైపు నుండి బొమ్మనహాళ్ వైపున మొక్కజొన్న లోడుతో ఐచర్ వాహనం వేగంగా వెళ్తుంది. పొలం వైపు నుండి రోడ్డుపైకి వస్తున్నా ద్విచక్రవాహనదారుడుని గమనించలేదు. సమీపంలోకి వచ్చిన వెంటనే బైక్ ను తప్పించేందుకు వెళ్లి ఐచర్ వాహనం కుడివైపు వెళ్లి చెట్టును, విద్యుత్ ట్రాన్స్ఫార్మరును ఢీకొట్టింది. ఉప్పర వీరేష్ అక్కడిక్కడే మృతి చెందగా, మండలంలోని దేవగిరి గ్రామానికి చెందిన ఐచర్ వాహనం డ్రైవర్ బసవ రాజు, హమాలీలు చంద్రశేఖర్, మారెన్న, ఉమేష్ తోపాటు మరో 10 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సరిహద్దు కర్ణాటకలోని బళ్లారి విమ్స్ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు, డి. హీరేహాళ్ ఎస్సైలు నాగమదు, గురుప్రసాదరెడ్డి, బొమ్మనహళ్ ఏఎస్ఐ విజయ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బళ్లారి కి తరలించారు. మృతుడు తల్లి ఉలిగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
