తాడిమర్రి(yes9tv)శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
తాడిమరి మండలంలోని పుల్లంపల్లి గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడినవి. గ్రామానికి చెందిన అశోక్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, ఆకు పూజలు మరియు విశేష అలంకరణలు నిర్వహించబడినవి.
ఈ సందర్భంగా ఆలయం పూలతో, ఆకులతో అందంగా అలంకరించబడగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమం భక్తి భావంతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగింది.
గ్రామస్తులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
పుల్లంపల్లిలో భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు: ఆంజనేయ స్వామికి ఆకుపూజ, ప్రత్యేక అలంకరణలు
