Latest Posts

అనంతపురంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ ఉత్సవం: 430 మంది చేతివృత్తి కళాకారులకు ఆధునిక పనిముట్ల పంపిణీ

అనంతపురం జిల్లా.

*ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి*

– *: ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంతో స్వయం సమృద్ధి సాధించాలి*

– *: భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీకి చెందిన కేవీఐసి ఛైర్మన్ మనోజ్ కుమార్*

– *: అనంతపురంలో కేవీఐసి ఆధ్వర్యంలో ఘనంగా ‘ఆత్మనిర్భర్ భారత్’ ఉత్సవం*

అనంతపురం, మార్చి 27 :

– *ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంతో స్వయం సమృద్ధి సాధించాలని భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీకి చెందిన కేవీఐసి ఛైర్మన్ మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు.*

– *శుక్రవారం అనంతపురం నగరంలోని న్యూటౌన్‌లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గ్రామొద్యోగ్ వికాస్ యోజన (GVY) కింద, విజయవాడలోని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) రాష్ట్ర కార్యాలయం వారు నిర్వహించిన శిక్షణ పూర్తి చేసుకున్న మొత్తం 430 మంది సాంప్రదాయ చేతివృత్తి కళాకారుల లబ్ధిదారులకు పనిముట్లు/పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీకి చెందిన కేవీఐసి ఛైర్మన్ మనోజ్ కుమార్ పాల్గొన్నారు.*

– *ఈ సందర్భంగా కేవీఐసి ఛైర్మన్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ అనంతపురంలో ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ (KVIC) ఆధ్వర్యంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ ఉత్సవం ఘనంగా నిర్వహించబడిందన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’, ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ మరియు ‘వికసిత్ భారత్’ సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇది కేవలం రాజకీయ కార్యక్రమం కాదు, మన సంస్కృతిని మరియు స్వయంశక్తిని చాటిచెప్పే ఉత్సవం అని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనేకమంది చేతివృత్తుల కళాకారులకు ఆధునిక యంత్రాలు మరియు పనిముట్లను పంపిణీ చేశామన్నారు. ఉపకరణాలు పొందని వారు తమ వివరాలను కార్యాలయంలో సమర్పించాలని, శిక్షణ అనంతరం ప్రతి ఒక్కరికీ ఆధునిక పనిముట్లు అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గత 11 ఏళ్లలో ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరిగాయని, గతంలో 30-32 వేల కోట్లుగా ఉన్న అమ్మకాలు, ప్రస్తుతం 1.70 లక్షల కోట్లకు చేరడం విశేషమన్నారు.*

– *ఖాదీ కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, అది ఒక ఉద్యమం మరియు ఒక గొప్ప ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వారసత్వమైన ఖాదీని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 11 ఏళ్లలో ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్లారని కొనియాడారు. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు మరియు కుమ్మరి వంటి సంప్రదాయ వృత్తుల వారికి ప్రభుత్వం శిక్షణ మరియు పనిముట్లు (Toolkits) అందజేస్తోందని చెప్పారు. వారికి శిక్షణతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు, ఎగ్జిబిషన్లు, ఆన్‌లైన్ విక్రయాలు మరియు PMEGP పథకం ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారి ఇంటి వద్దే ఉపాధి పొందేలా పటిష్టమైన వ్యవస్థను ప్రధాని రూపొందించారని ఆయన అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో తమ బృందం దేశవ్యాప్తంగా పర్యటిస్తోందని, నిన్న ఛత్తీస్‌గఢ్‌లో, అంతకుముందు గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, అస్సాం, కేరళ వంటి రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. అనంతపురంలో సుమారు 500 మంది లబ్ధిదారులకు కుట్టు మిషన్లు మరియు ఇతర పనిముట్లు పంపిణీ చేశామని, మిషన్లు అందని మహిళలకు తదుపరి విడతలో ఖచ్చితంగా అందజేస్తామని, భవిష్యత్తులో పిండి గిరణి (Flour mill) వంటి యంత్రాలను కూడా అందిస్తామన్నారు.ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని, ప్రతి భారతీయుడిని స్వయంశక్తివంతుడిగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. యువత కేవలం ఉద్యోగాల కోసం వెతకడమే కాకుండా, ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) ద్వారా 50 లక్షల వరకు రుణం మరియు 35 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందని వివరించారు. అతిగా మొబైల్ వాడకానికి దూరంగా ఉండాలని, సంతోషంగా ఉంటూ ఇతరులను నవ్వించాలన్నారు. చివరగా ‘భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీరామ్’ నినాదాలతో ప్రసంగాన్ని ముగించారు.*

– *ఈ సందర్భంగా 430 మంది సాంప్రదాయ చేతివృత్తి కళాకారుల లబ్ధిదారులకు 414 పనిముట్లు/పరికరాలను కేవీఐసి ఛైర్మన్ పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు.*

– *ఈ కార్యక్రమంలో కేవీఐసి డిప్యూటీ సీఈవో మదన్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఈవో నల్లముత్తు, స్టేట్ డైరెక్టర్ క్రీప్, బెంగళూరు డైరెక్టర్ మోహన్ రావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసయాదవ్, చేనేత జౌళి శాఖ ఏడి వరప్రసాద్, హ్యాండ్లూమ్స్ అభివృద్ధి అధికారి బసవరాజు, కేవీఐసి రవి, దాదాపు 80 ఖాదీ సంస్థలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor