జిల్లా : కర్నూల్
సెంటర్ : ఆలూరు
కర్నూల్ జిల్లా ఆలూరు పట్టణంలో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. దీపారాధన సమయంలో ఒక భక్తురాలి చీరకు మంటలు అంటుకోవడంతో ఆలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి…మారుతి నగరంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుండగా, భారతీ అనే భక్తురాలి చీరకు మంటలు అంటుకున్నాయి…
అప్రమత్తమైన భక్తులు వెంటనే మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది…
గాయపడిన ఆమెను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు…
