Latest Posts

నల్లసింగయ్యగారిపల్లెలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం: లోకక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దంపతులు

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తమ స్వగ్రామం నల్లసింగయ్యగారిపల్లెలో లోకక్షేమం, సర్వజన సుఖశాంతి కోసం సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, అపర్ణ రెడ్డి దంపతులు
శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ద్వారా ప్రతి ఇంటిలో ఆనందం,ఐశ్వర్యం,శాంతి నెలకొనాలని వారు మనస్ఫూర్తిగా కోరుకొంటూ..సీతారాముల దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరి పైన ఉండాలని అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవము జరిపించారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో దుద్దుకుంట కుటుంబ సభ్యులు, నల్లసింగయ్యగారిపల్లె గ్రామ ప్రజలు మరియు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor