Latest Posts

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి ‘ఐక్య పోరాట ఫలితం’: ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

*ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి: ఐక్య పోరాటానికి విజయ ఫలితం*

-ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కోసం ధర్నా, లక్ష సంతకాల సేకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాయి,

-వైస్సార్ సీపీ తో పాటు కాంగ్రెస్, సీపీఐ సిపిఎం ప్రజా సంఘాల విజయం ఇది

-ఆర్డీటీ అధినేత మ్యాంచు ఫెర్రర్ కు అభినందనలు

-ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

అనంతపురం:
అనంతపురం జిల్లా ప్రజలకు సంజీవినిగా నిలిచిన ఆర్డీటీ (RDT)కి ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) అనుమతి మంజూరు చేయడం పట్ల ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తమ పోరాటానికి లభించిన విజయంగా మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయడం పై వైఎస్సార్‌సీపీ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ నోట్ విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ తో పాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల సమిష్టి కృషి వల్లే ఈ అనుమతి సాధ్యమైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీటీ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన మ్యాంచు ఫెర్రర్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి రావడంతో సంస్థ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తరించేందుకు మార్గం సుగమం అవుతుందని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా కళ్యాణదుర్గం ఇంచార్జి తలారి రంగయ్య ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్ర, సంతకాల సేకరణ కేంద్రం పై మరింత ఒత్తిడి పెంచాయని పేర్కొన్నారు. పైగా ఢిల్లీ స్థాయిలో తమ పార్టీ ఎంపీలు ప్రధాని కలిసి విన్నవించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉరవకొండలో నిర్వహించిన ధర్నా, లక్ష సంతకాల సేకరణ, అఖిలపక్ష సమావేశం, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ వంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయని ఆయన గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించడం ద్వారా ఒత్తిడి పెంచినట్లు తెలిపారు. ఈ పోరాటంలో తమతో కలిసి నడిచిన కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, విద్యార్థి సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఇలాంటి ఐక్య పోరాటాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

Posted Under AP
Editor