గరికపాటి…జ్ఞానమా? అజ్ఞానమా? పిల్లల భోజనం పై అవాకులా! గరికపాటి విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన అవమానకర వ్యాఖ్యలను అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థిసమాఖ్య (AIFDS)
రాష్ట్ర అధ్యక్షులు
సీఎం సిద్దు తీవ్రంగా ఖండించారు.
గరికపాటి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని వారు అన్నారు. ప్రవచనాల పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ “పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని, చదువు “మిద్య” అయిపోయిందని అనడం” అనే వ్యాఖ్యలు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను శోభనం పెల్లికొడుకుతో పోల్చడం విద్యారంగాన్ని కించపరచడమే అన్నారు. విద్యార్థులను అనుచితంగా పోల్చడం, మధ్యాహ్న భోజనంలో ఇచ్చే కోడిగుడ్డును గాడిద గుడ్డు అని సంభోదించడం, ఆకలిని కించపరచడమే అని అన్నారు. దేశంలో ఇంకా అనేక మంది పిల్లలు సరైన పౌష్టికాహారం లేక ఇబ్బందులు పడుతున్న వాస్తవాన్ని గరికపాటి గమనించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థులకు భోజనం, యూనిఫాం, పుస్తకాలు అందించడం ప్రభుత్వం బాధ్యత కాగా, వాటిని “బిచ్చం”గా అభివర్ణించడం అత్యంత సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న విషయంపై స్పందించలేని గరికపాటి, పేద విద్యార్థులకు అందించే భోజనంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు. అందువల్ల గరికపాటి నరసింహారావు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై వెంటనే స్పందించి, విద్యార్థులను అవమానించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇట్లు
ఉద్యమాభి వందనాలతో…. అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థిసమాఖ్య (AIFDS)
రాష్ట్ర అధ్యక్షులు
సీఎం సిద్దు
