విజయవాడ, అమరావతి
అమరావతి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీలా నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణ ఇవాల్టితో ముగియనుంది. అయితే, దర్యాప్తు అధికారి విజ్ఞప్తి మేరకు విచారణను హైకోర్టు పొడిగించింది. మరోవైపు సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను కూడా 12కి వాయిదా వేసింది.
