అనంతపురం జిల్లా
– ఏపీఐఐసీ, అనంతపురం పారిశ్రామిక వాడనందు సోమవారం నిర్వహించిన ఐలా సమావేశములో అనంతపురం పారిశ్రామిక వాడకు సంబంధించిన రోడ్లు మరియు వీధి దీపాలను మరమ్మత్తులు చేయవలసినదిగా ఐలా సభ్యులు జోనల్ మేనేజర్ ఎస్.వి.ఎస్.ఎస్.నాగకుమార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయమై జోనల్ మేనేజర్ ఐలా సభ్యులకు వెంటనే మరమ్మత్తులు పనులు చేపడతామని హామీ ఇచ్చారు మరియు జోనల్ మేనేజర్ అనంతపురం జిల్లాలోని వేకెన్సీ (Vacant plots) వివరాలను ఐలా సభ్యులకు వివరించారు.
– కూడేరు మండలం కూడేరు గ్రామంలోని MSMEలో 7.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 93 ప్లాట్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించడానికి అందుబాటులో ఉన్నాయి మరియు భూమి విలువను Rs.681/- ( Per Sq mtr) ఫర్ స్క్వేర్ మీటర్ గా నిర్ణయించడం జరిగింది.
– కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామం నందు తిమ్మసముద్రంలోని MSMEలో 13.40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 88 ప్లాట్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయింపు కోసం అందుబాటులో ఉన్నాయి మరియు భూమి విలువను Rs.741/- ( Per Sq mtr) ఫర్ స్క్వేర్ మీటర్ గా నిర్ణయించడం జరిగింది.
– తాడపత్రి మండలం ఊరిచింతల గ్రామం నందు MSMEలో 10.86 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 112 ప్లాట్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయింపు కోసం అందుబాటులో ఉన్నాయి మరియు భూమి విలువను Rs.865/- ( Per Sq mtr) ఫర్ స్క్వేర్ మీటర్ గా నిర్ణయించడం జరిగింది.
– అనంతపురం పట్టణమునందు చిన్న పారిశ్రామికవేత్తలకు అనువైన విధముగా అనంతపురం పట్టణం కలెక్టర్ వారి కార్యాలయం ప్రక్కనగల సిరికల్చర్ ఆఫీసు నందు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (FFCs- Flatted Factory Complexes) లను ఏపీఐఐసీ ద్వారా నిర్మించడం జరుగుతున్నది.
– ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఈ ప్రభుత్వం వారు భూమి విలువ పైన 75 శాతం రాయతీని కల్పించడం జరిగినదని తెలిపారు. ఈ సదవకాశాన్ని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకొనవలసినదిగా కోరుచున్నాము.
– ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ ఏపీఐఐసీ, ఎస్.వి.ఎస్.ఎస్.నాగకుమార్, జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ జి.ఎం. రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ జోనల్ మేనేజర్ ఇంజనీరింగ్ శ్రీమతి దేవకాంతమ్మ, ప్రాజెక్టు ఇంజనీర్ విశ్వం, ఏపీఐఐసీ జూనియర్ మేనేజర్ శివ మోహన్ కృష్ణ, ఎం.వి.సాయిసాగర్, సీనియర్ ఐటి అసోసియేట్, ఎస్ విజయలక్ష్మి, ఐలా –జేఎం మరియు పారిశ్రామిక వాడా అనంతపురం ఎంఎస్ఎంఎల్, రాప్తాడు సంబంధించిన 50 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
