అనంతపురము, మార్చి 09:
– *గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలికలకు హెచ్.పి.వి టీకా వేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలికలకు హెచ్.పి.వి (HPV) టీకా వేయడానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హుమన్ పపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ ను జిల్లాలోని 51 పిహెచ్సిలు, 25 యుపిహెచ్సిలు, 6 పిపి యూనిట్ల పరిధిలో వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 16,449 మంది 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ల బాలికలను వ్యాక్సినేషన్ కోసం గుర్తించడం జరగగా, జిల్లాకు 0.5 ఎంఎల్ డోసులు 9 వేలు రావడం జరిగిందన్నారు. జిల్లాలోని 14 సంవత్సరాలు నిండిన 15 సంవత్సరాలలోపు బాలికలకు ఈ హెచ్.పి.వి టీకా వేసేలా చూడాలన్నారు. డిఆర్డిఏ, మెప్మా, ఐసిడిఎస్ పీడీలు వారి పరిధిలో జరిగే వివో సమావేశాల్లో టీకాపై అవగాహన కల్పించాలని, వ్యాక్సిన్ కు సంబంధించి పిల్లలకు, తల్లులకు అవగాహన కల్పించేలా చూడాలని, ఈ విషయమై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. హెచ్.పి.వి టీకా ఒక డోస్ 3,987 రూపాయలు కాగా, దానిని ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. దేశంలో ప్రతి ఏడాది 1,20,000 మందికి హెచ్.పి.వి వస్తోందని, ఇందులో 70 వేల నుంచి 80 వేల మంది చనిపోతున్నారన్నారు. సర్వైకల్ క్యాన్సర్ కు ఒక లక్ష పాపులేషన్ లో 42.82 శాతం మరణాలు జరుగుతున్నాయన్నారు. 14 ఏళ్ల పైబడి 15 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్క బాలికలు ఈ టీకా వేసుకొనేలా చూడాలన్నారు. వచ్చే బుధవారం 11వ తేదీన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలవుతుందని, 3 నెలలపాటు ఈ కార్యక్రమంలో జరుగుతుందని, జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.*
– *ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, ఎస్డీసిలు రామ్మోహన్, ఆనంద్, మల్లికార్జునుడు, పద్మావతి, జిజిహెచ్ అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి, ఇంచార్జి డిఎంహెచ్వో శ్రీనివాస్ రెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ రెడ్డి, డిఐఓ శశిభూషణ్ రెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు.*
