శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి క్షేత్రంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం వేడుకగా నిర్వహించారు. అంతేకాకుండా మృత్యుంజయ స్వామికి విశేష అభిషేకాలు జరిగాయి. పాలు, పెరుగు, గంధం, తేనె, విభూది, కొబ్బరినీళ్లు, సుగంధ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. ప్రత్యేక అలంకారం చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు…
