Latest Posts

తాడిమర్రిలో కుక్కల బీభత్సం: 30 గొర్రె పిల్లలు, ఒక గొర్రె మృతి – కన్నీరుమున్నీరవుతున్న గొర్రెల కాపరి

తాడిమర్రి YES 9 (TV)కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు, ఒక గొర్రె మృతి – గొర్రెల కాపరి ఆవేదన
తాడిమర్రి మండలం చిల్ల కొండయ్యపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బిల్లే పెద్ద ఓసూర్ కుమారుడు బిల్లే శివయ్యకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేసి భారీ నష్టం కలిగించాయి.
గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేకపోవడం, పంటలకు సరైన మద్దతు ధరలు లేకపోవడంతో జీవనోపాధి కోసం గొర్రెలను మేపుకుంటూ జీవిస్తున్న శివయ్య, ప్రతిరోజులాగే గొర్రెలను కొండపైకి మేపడానికి తీసుకెళ్లి సాయంత్రం గొర్రెల పాక వద్దకు తీసుకువచ్చాడు. ఈ సమయంలో దాదాపు 30 గొర్రె పిల్లలు మరియు ఒక గొర్రెపై వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసి చంపివేశాయి.
ఈ ఘటనతో గొర్రెల కాపరి శివయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సంవత్సరానికి ఒక రైతుకు పంట ఎలా ముఖ్యమో, గొర్రెల కాపరికి గొర్రెలు ఈనడం కూడా అదే విధంగా అతని పంటలాంటిదని తెలిపారు. ఒక్కసారిగా జరిగిన ఈ నష్టంతో తన జీవనోపాధి దెబ్బతిన్నదని వాపోయాడు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించి ఆదుకోవాలని శివయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాడు.
గ్రామస్థులు కూడా ప్రభుత్వ అధికారులు స్పందించి బాధిత గొర్రెల కాపరికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Posted Under AP
Editor