అనంతపురం జిల్లా రాయదుర్గం
• సిఐటియు ఆధ్వర్యంలో రిలే దీక్షలు
•ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని
మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు , ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే నాగభూషణం నాయకులు హెచ్చరించారు.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్
కార్మికులు రాయదుర్గంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ అవుట్సోర్సింగ్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు మున్సిపల్ కార్మికులు శనివారం రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే నాగభూషణం మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి రాము, కోశాధికారి తిప్పేరుద్ర, నాయకులు తిప్పే స్వామి, మల్లేష్ వన్నూరమ్మ, ఆదిలక్ష్మి, లావణ్య, సహనాభి, శివమ్మ, తదితరులు పాల్గొన్నారు.
