Latest Posts

పెరుగుతున్న ఎండలు.. వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి: మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

• ఎండలు పెరుగుతున్నాయి … జాగ్రత్త

వేసవి కాలంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ నుంచి అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్ సూచించారు.

రాయదుర్గం మండల పరిధిలోని రాయంపల్లి గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపట్టి, ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించారు. వడదెబ్బ తీవ్ర పరిస్థితుల్లో మెదడు, గుండె, కిడ్నీ మరియు కాలేయంపై ప్రభావం చూపి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చని తెలిపారు. ఎక్కువసేపు ఎండలో ఉండటం, తగినంత నీరు తాగకపోవడం వల్ల వడదెబ్బ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా రైతులు, నిర్మాణ కార్మికులు, చిన్నపిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి చల్లని నీరు ఇవ్వాలని, అవసరమైతే ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఎండలో తిరగకుండా ఉండాలని సూచించారు. అలాగే ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి వారం “ఫ్రైడే డ్రైడే” పాటిస్తూ దోమల నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలేరియా హెల్త్ అసిస్టెంట్లు ఎర్రిస్వామి, రవి రాజు, ఏఎన్‌ఎం వినోద కుమారి, ఎంఎల్‌హెచ్‌పీ కవిత, అంగన్వాడీ కార్యకర్త సుజాత మరియు ఆశా కార్యకర్తలు లక్ష్మీ , చంద్ర కల ,సురేఖ పాల్గొన్నారు.

Posted Under AP
Editor