అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం
అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా
కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనను కళ్యాణదుర్గం అగ్నిమాపక శాఖ S.F.O L.వసంత నాయక్ గారు ప్రారంభించడం జరిగింది
ఈ సందర్భంగా వసంత నాయక్ గారు మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని, ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన సామాన్య ప్రజలకు, మరీ ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆందోళనకు గురికాకుండా ఎలా ఎదుర్కోవాలనేది అవగాహన కలిగి ఉంటే వాటిని తీసుకురాగలమని తెలిపారు .
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన సునీత సంగప్ప గారు మరియు అకాడమిక్ డైరెక్టర్స్ శ్రీ నరసింహ చారి, శ్రీ మహబూబ్ జాన్ గారు ప్రధానోపాధ్యాయులు శ్రీ విశ్వనాథ్ గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది
