అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం
సోషల్ మీడియా పోస్టులపై డిఎస్పి రవిబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు.
కళ్యాణదుర్గం సబ్-డివిజన్ పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీఎస్పీ రవిబాబు మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్ ఛానెల్స్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర ప్లాట్‌ఫామ్‌లలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలు లేదా సందేశాలు పోస్ట్ చేయడం, షేర్ చేయడం లేదా ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు.
మతపరమైన విద్వేషాలు, అపోహలు లేదా సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు చట్టపరమైన తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాంటి పోస్టులను షేర్ చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని అలాగే గ్రూప్ అడ్మిన్ లకు కూడా బాధ్యత ఉంటుందని హెచ్చరించారు.
ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 353(2) ప్రకారం ప్రజల్లో అపోహలు, వదంతులు వ్యాప్తి చేయడం, IPC సెక్షన్ 505, అలాగే ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66D మరియు సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ప్రజలు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, ఎలాంటి ధృవీకరణ లేకుండా వచ్చే వదంతులను నమ్మకూడదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే పోస్టులను షేర్ చేయకుండా ఉండాలని పోలీసులు సూచించారు.
సమాజంలో శాంతి భద్రతలు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
