అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం
రైలు కిందపడి 15 గొర్రెలు మృతి
డి. హిరేహాల్ మండలం హొసగుడ్డం గ్రామ సమీపంలో శనివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో గుంతకల్లు నుంచి చిక్కజాజూరు వెళ్తున్న ప్యాసింజర్ రైలు గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 15 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల కాపరి కళ్లముందే మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
