Latest Posts

డీఎస్పీ కార్యాలయం వెనుక సూపర్ మార్కెట్‌లో దొంగతనం…

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం

డీఎస్పీ కార్యాలయం వెనుక సూపర్ మార్కెట్‌లో దొంగతనం

కళ్యాణదుర్గం పట్టణంలో డీఎస్పీ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న మెట్రో సూపర్ మార్కెట్‌లో అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారని దుకాణ యజమానులు తెలిపారు.
దుకాణంలో ఎంత మొత్తంలో నగదు లేదా సరుకులు చోరీ అయ్యాయన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Posted Under AP
Editor