Latest Posts

కళ్యాణదుర్గంలో అర్థరాత్రి మైనర్ బాలుడి హల్చల్: అతివేగంతో కారు నడిపి ఇంటి ప్రహరీ గోడకు ఢీ!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం పట్టణం దొడగట్ట రోడ్డు లో శుక్రవారం అర్థరాత్రి సుమారు ఒకటిన్నర గంట సమయంలో పెను ప్రమాదం జరిగింది.

మైనర్ బాలుడు అతివేగంతో కారు డ్రైవ్ చేయడంతో రోడ్డు పక్కన ఉన్న రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ డిడి సత్యనారాయణ ఇంటి కాంపౌండ్ వాల్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు నుజ్జైంది. అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంటి కాంపౌండ్ లోపలి భాగంలో మూడు ద్విచక్ర వాహనాలు ఉండడంతో వాటిపై కాంపౌండ్ వాల్ కు ఉన్న సిమెంట్ దిమ్మెలు పడి దెబ్బతిన్నాయి. మైనర్ బాలుడు జ్ఞానబారతి పాఠశాలలో పదో తరగతి చదువుతున్నట్టు తెలిసింది. కారులో ఒక్కడే ఉంటూ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. కారు నడిపిన విద్యార్థిని పట్టుకొన్న స్థానికులు పట్టణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి న్యాయం చేయాలని ఇంటి యజమాని సత్యనారాయణ కోరుతున్నారు.

Posted Under AP
Editor