చంద్రప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు, సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో విద్యుత్ కాంతులు సుగంధ పుష్పాలతో విలాజిల్లుతుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు లక్ష్మీ నరసింహ స్వామి వారు చంద్రప్రభ వాహనోత్సవము వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారు చంద్రప్రభ వాహనంపై ఆశీనులై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రప్రభ వాహనోత్సవం ముందు కళాకారులు ప్రత్యేక వాయిద్యాలలో ప్రదర్శించారు. జానపద కలల ప్రదర్శనతో భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయం యొక్క ఈవో శ్రీనివాస రెడ్డి గారు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో భక్తులు వేలాదిమంది పాల్గొని కన్నుల విందుగా నడిపించారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న అందరికీ YES9 టీవీ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.🙏🙏🙏.
కదిరిలో కన్నులపండువగా చంద్రప్రభ వాహన సేవ: వైభవంగా సాగుతున్న లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
