యువత అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి…

  • యువత అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి…
  • 522 మందికి ఉద్యోగ నియామక పత్రాలు…
  • మెగా జాబ్ మేళాలో ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి.

 

నేటి సమాజంలో యువత అవకాలను అందిపుచ్చుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి సూచించారు. ఎపిఎన్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలోని అనెక్స్ బిల్డింగ్ లో ఎపిఎస్ఎస్ఎస్ డిసి సౌజన్యంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా ప్రారంభ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి మాట్లాడుతూ ఎపిఎస్పిడిసిఎల్ లో పొరుగు సేవల కింద ఉద్యోగాల కోసం అభ్యర్థులు ప్రజా ప్రతినిధులు, అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకు వస్తున్నారని తెలిపారు. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎఎస్ డిసి) సహకారంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1,577 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలియజేశారు. ఆయా కంపెనీల అవసరాల మేరకు అభ్యర్థులను ఉద్యోగాల్లోకి ఎంపిక చేసుకుంటాయని తెలిపారు. అభ్యర్థులు నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా కంపెనీల అవసరాల మేరకు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ముందడుగు వేయాలని, కంపెనీ తమను వదులుకోలేని విధంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తద్వారా యువత తమకాళ్ళపై తాము నిలబడడమే కాకుండా కుటుంబానికి ఆసరాగా వుండే అవకాశం లభిస్తుందన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ నేడు ప్రైవేటు సంస్థల్లో కూడా మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. తిరుపతి జిల్లా పరిధిలో 55 దేశాలకు చెందిన సుమారు 500కు పైగా కంపెనీలు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చి చూసినట్లయితే ప్రైవేటు సంస్థల్లోనే ఉద్యోగుల వృద్ధి బాగుంటుందని తెలిపారు. యువతకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ఎపిఎన్పిడిసిఎల్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వివిధ ప్రైవేటు కంపెనీల హెచ్ఆర్ మేనేజర్లు తమ తమ కంపెనీల గురించి, ఉద్యోగావకాశాల గురించి యువతకు వివరించారు.

522 మందికి నియామక పత్రాల అందజేత

ఈ జాబ్ మేళా ద్వారా వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి చేతుల మీదుగా బుధవారం సాయంత్రం ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎండి వారిని అభినందించారు.

Posted Under AP
Editor