పెనుమూరు:
ఎదురు ఎదురుగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పెనుమూరు మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు పెనుమూరు మండలం స్వామి రెడ్డి పల్లి పంచాయతీ బట్టు వారి పల్లె గ్రామానికి చెందిన మునస్వామి కుమారుడు గోవిందు (45) తాసిల్దార్ కార్యాలయం వద్ద అర్జీలు రాస్తుంటాడు. బుధవారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి పెనుమూరు నుండి బయలు దేరాడు. ఇదే క్రమంలో పాకాల మండలంకు చెందిన బాబు (60), రెడ్డప్ప ఆచారి (75) చిత్తూరు నుండి పెనుమూరు వైపు ద్విచక్ర వాహనంలో వస్తుండగా చర్వగాని పల్లె సమీపంలో ఎదురు ఎదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో గోవిందు అక్కడికక్కడే మృతి చెందగా బాబు, రెడ్డప్ప ఆచారి తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పెనుమూరు ఎస్సై శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
