జనగణన కార్యక్రమాన్ని బాధ్యత గా నిర్వహించాలి…. డిఆర్ఓ మలోలా

అనంతపురం జిల్లా.

అనంతపురం గత ఒకటిన్నర దశాబ్దం తర్వాత చేపడుతున్న జన గణన కార్యక్రమంలో జిల్లాలో బాధ్యతగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మరియు జిల్లా సెన్సెస్ అధికారి మలోలా సూచించారు. బుధవారం స్థానిక జేఎన్టీయూ కళాశాలలో నిన్నటి నుండి జన గణన పై శిక్షణ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో నేటి ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6 వరకు యూనివర్సిటీలోని సెంట్రల్ కంప్యూటర్ సెంటర్ బ్లాక్ లో అధికారులు, ముఖ్య సిబ్బందికి శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో డేటా సేకరణ కు సంబంధించి హైదరాబాద్ మరియు విజయవాడ నుండి సెన్సెస్ శిక్షణ బృందం సభ్యులు జాయింట్ డైరెక్టర్ జగన్నాథ్ మజ్ హి, చట్టి శ్రీనివాసులు, దివాకర్ బరిహ, మాస్టర్ ట్రైనర్ మోహన్ రమణ, దీపక్ భరద్వాజ్ దామోదర్ అమిత్ సింగ్ విష్ణు మాధవి బృందం ఆధ్వర్యంలో సులభతరంగా అర్థమయ్యే విధంగా జన గణన ప్రక్రియను పూర్తిస్థాయిలో చేపట్టాలన్న అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా సేకరించిన వివరాలను కంప్యూటర్ మెయింటనెన్స్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎంఎంఎస్) ద్వారా 33 అంశాల పై నమోదు గురించి శిక్షణ కల్పించారు.
అంతకుముందు డిఆర్ఓ మరియు జిల్లా సెన్సెస్ అధికారి మలోలా మాట్లాడుతూ ప్రస్తుతం ఈ జన గణన కార్యక్రమం గతం కంటే భిన్నంగా పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ప్రధాన సెన్సెస్ అధికారిగా ,జాయింట్ కలెక్టర్ అదనపు సెన్సెస్ అధికారిగా, డిఆర్ఓ జిల్లా సెన్సెస్ అధికారిగా కార్పొరేషన్ లో కమిషనర్ ప్రధాన సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. మండల స్థాయిలో సూపర్వైజర్లు,ఎన్యుమరేటర్లు ఉంటారని తెలిపారు. మొదటి దశలో గ్రామ మ్యాపింగ్, ఇళ్ల జాబితా సేకరణ, ఆ తర్వాత జనాభా లెక్కింపు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మూడు రోజులు జరుగుతున్న శిక్షణా తరగతులలో ఎలాంటి సందేహాలుఉన్నాకూడావాటిని నివృత్తి చేసుకోవాలన్నారు. ఈసారి జనాభా లెక్కలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా సేకరించబడే అవకాశం ఉందని పౌరులు కూడా తమ వివరాలు భయంగా నమోదు చేసుకునే సౌకర్యం ఉన్నట్లుపేర్కొన్నారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగాలోపరహితంగా పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లాకుమంచి పేరు తీసుకురావాలని డిఆర్ఓ మలోలా కోరారు. అనంతరం డిజిటల్ విధానం ద్వారా నమోదు అవుతున్న వివరాల ప్రక్రియను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డిఓ కేశవ నాయుడు, కళ్యాణ్ దుర్గం ఆర్డీవో వసంత బాబు, గుంతకల్ ఆర్డీవో శ్రీనివాస్, సిపిఓ అశోక్, డీఈవో ప్రసాద్ బాబు, డిపిఓ నాగరాజ నాయుడు, జడ్పీ సీఈవో శివశంకర్, మున్సిపల్ కమిషనర్లు, తాసిల్దారులు, ఎంపీడీవోలు , తాసిల్దారులు హరికుమార్ ,రాజా, సూపర్డెంట్ కోఆర్డినేషన్ యోగేశ్వరి దేవి, లు, డిప్యూటీ తాసిల్దారులు కనకరాజు మధుసూదనరావు, ఎస్వ గిరిధర్ ,ఏ ఎస్ ఓ లు ,టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor