Latest Posts

వివాహనిశ్చితార్థం కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి..

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని బాలాజీ విద్యానికేతన్ కరస్పాండెంట్ వలిసిరెడ్డి ప్రతాపరెడ్డి చంద్రకళల కుమార్తె డాక్టర్ రుతేష రెడ్డి వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్లమాడ మండల కేంద్రంలోని బాలాజీ విద్యానికేతన్ పాఠశాల లో ప్రతాపరెడ్డి కుమార్తె రుతేష్ వెడ్స్ డాక్టర్ జయసూర్య రెడ్డి ల వివాహ నిశ్చితార్థం కార్యక్రమానికి ఆదివారం మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం అక్కడికి చేసిన పల్లె బంధువులను నియోజకవర్గ నాయకులు కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అక్క కుమార్తె హేమలత అల్లుడు వలసి రెడ్డి బ్రహ్మానందరెడ్డి, ప్రకాష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్లమాడ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor