Latest Posts

కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు: వైభవంగా స్వామివారి కల్యాణ మహోత్సవం

* ఖాద్రినరసింహుని కళ్యాణోత్సవం 28-02-2026,కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల్లో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు,మంత్రి సవిత,జిల్లా hbఅధ్యక్షులు ఎంఎస్ రాజు,జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ గారు,అనంతపురం జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు, ఎమ్మెల్యే పరిటాల సునీత గారు*

*బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న కందికుంట వెంకటప్రసాద్ గారు*

*స్వామివారి కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సవిత*

*బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సవిత,జిల్లా అధ్యక్షులు ఎంఎస్ రాజు,జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ,అనంతపురం జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు,ఎమ్మెల్యే పరిటాల సునీత, గారికి ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు*

కదిరిః శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ని శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మంత్రి సవిత గారు,జిల్లా అధ్యక్షులు ఎంఎస్ రాజు, అనంతపురం జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు,ఎమ్మెల్యే పరిటాల సునీత గారు తదితరులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలపై వెలసిన మహా విష్ణువు ప్రతిరూపం కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీన అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు వైభవంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం జరిగిన స్వామివారి కల్యాణమహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
#khadrilakshminarasimhaswamibrahmotsavalu2026
#khadrilakshminarasimhaswamykalyanam
#brahmotsavam2026 #kandikuntavenkataprasad #kadiri

Posted Under AP
Editor