తాడిమర్రిలో ఆర్‌ఎంపీ క్లినిక్‌ల తనిఖీ: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!

తాడిమర్రి మండలంలో గల ఆర్ఎంపీ క్లినిక్‌లను జిల్లా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ చంద్ర నాయక్ మరియు డా. ఎం. హరిత ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు ఆర్ఎంపీలు తప్పనిసరిగా అన్ని అర్హతలతో కూడిన సర్టిఫికెట్లు కలిగి ఉండాలని సూచించారు. అలాగే డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకుని క్లినిక్‌లు నిర్వహించాలన్నారు.
అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా క్లినిక్‌లు నిర్వహిస్తే వాటిని మూసివేసే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీహెస్ రామ్ కుమార్, జానకి రామ్ పాల్గొన్నారు.

Posted Under AP
Editor