Latest Posts

చిల్లవారిపల్లిలో వైభవంగా కాటి కోటేశ్వర స్వామి ‘పొంగుల వారం’ వేడుకలు

తాడిమర్రి ఫిబ్రవరి 8:(YES9TV) కాటి కోటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో పొంగుల వారం
తాడిమర్రి మండలం చిల్లవారిపల్లి గ్రామంలో గల కాటి కోటేశ్వర స్వామి దేవస్థానంలో పొంగుల వారం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు కుండలలో పాలను పొంగించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు.
ఈ వేడుకల్లో స్వామి కాపులైన జాన గాని అంకే చిల్లా గంగిరెడ్డి, నల్లపు దాసు (గానిపల్లి) వారు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పాలు పొంగించి నైవేద్యం సమర్పించారు. దాదాపుగా 2,000 మంది భక్తులు ప్రత్యేక పూజలలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్వామివారి పూజారి చిల్లా నాగేష్, బొట్టు క్రిష్ట, చిల్లా శివయ్య, కాటమయ్య, దేవస్థాన చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ వై.ఎం. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
వేడుకల్లో భాగంగా నిర్వహించిన కట్టెల కోలన్న కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అంతేకాకుండా భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది.
పొంగుల వారం సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి కొల్లు రమేష్ నాయుడు, కొల్లు సరస్వతి దంపతులు దాదాపుగా రూ. 2.5 లక్షలు విరాళంగా అందించి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలతో ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Posted Under AP
Editor