- గర్భిణీ మహిళ మరణానికి కారణమైన పద్మావతి హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాలి సిపిఐ డిమాండ్
- డాక్టర్ జానకిరామయ్య ను అరెస్టు చేసి లైసెన్సును రద్దు చేయాలి.
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే స్పందించి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలి
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో రోడ్డుపైన కూర్చుని రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కదిరి పట్టణంలోని పద్మావతి హాస్పిటల్ నందు NP కుంట మండలం జకల గ్రామానికి చెందినటువంటి హరిణి అనేటువంటి గర్భిణి మహిళ గత పది రోజుల క్రితం పద్మావతి హాస్పిటల్ నందు అడ్మిట్ కావడం జరిగింది. అడ్మిట్ అయిన సందర్భంలో డాక్టర్ నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదని ఇక్కడే నార్మల్ డెలివరీ చేస్తామని మోసపూరిత మాటలు చెప్పి తల్లి బిడ్డ మరణానికి డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అని వారు అన్నారు. అంతేకాకుండా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పద్మావతి హాస్పిటల్ గుర్తింపును రద్దుచేసి డాక్టర్ లైసెన్స్ ను క్యాన్సల్ చేయాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తున్న లేదంటే దశలవారగా ఉద్యమాలకు శ్రీకారం చూడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప, సిపిఐ కదిరి డివిజన్ కార్యదర్శి నల్లజోడు పవన్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మధు నాయక్, పట్టణ కార్యదర్శి sk లియాకత్ ఆలీ, AISF జిల్లా కార్యదర్శి శేషం మహేంద్ర సిపిఐ టౌన్ సహాయ కార్యదర్శి అదేప్ప, AISF నాయకులు, శ్రీను, విజయ్, సూరి, మెహర్ బాబా, వేణు తదితరులు పాల్గొన్నారు.
