నల్లమాడ మండలం ఎన్.బడవాండ్ల పల్లి గ్రామంలో రామాలయ నిర్మాణానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి రూ.50వేలు విరాళంగా ఆ గ్రామస్థులకు అందజేశారు. ఎన్నికల ముందు ఆ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సోమవారం పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి కార్యాలయంలో ఎన్.బడవాండ్ల పల్లి గ్రామస్తులకు రామాలయ నిర్మాణం కోసం ఆర్థిక సాయాన్ని అందజేశారు. గ్రామానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎంఎల్ ఏ పల్లె సింధూర రెడ్డి కి ఆ గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రామాలయానికి రూ.50వేలు విరాళం ఇచ్చిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
