అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ ఓటర్స్ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదినారాయణ ఆధ్వర్యంలో రాజనీతి శాస్త్రం శాఖ అధ్యాపకులు సిరాజ్ అలీ ఖాన్ అధ్యక్షతన జాతీయ ఓటర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం నియమా నిబంధనల ద్వారా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని అదేవిధంగా 1990-95 దశకంలో నాటి భారత ఎన్నికల కమిషన్ చైర్మన్ టి ఎన్ శేషన్ నేతృత్వంలో భారతదేశ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అదేవిధంగా అధ్యాపక బృందం అర్థశాస్త్ర అధ్యాపకులు, డాక్టర్ అయ్యన్న, ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ వెంకట రాముడు, ఆంగ్ల శాస్త్ర అధ్యాపకులు నారాయణస్వామి, చరిత్ర అధ్యాపకులు రమేష్, ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్ ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలి వాటి యొక్క విలువలను తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఘనంగా జాతీయ ఓటర్స్ దినోత్సవం..
