అంతర్జాతీయ వైశ్య సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధికార ప్రతినిధిగా శ్రీకాళహస్తికి చెందిన అయితా మురళీకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోన శ్రీనివాసరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. మురళీకృష్ణ ఈ పదవిలో 2028 వరకు కొనసాగుతారని నియామక పత్రంలో పేర్కొన్నారు. ఫెడరేషన్ యొక్క ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా వైశ్య సామాజిక వర్గ అభివృద్ధికి ఆయన కృషి చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సంస్థలో రాష్ట్రస్థాయి బాధ్యతలు దక్కడంపై పట్టణంలోని పలువురు ప్రముఖులు, వైశ్య సంఘం నాయకులు మురళీకృష్ణకు అభినందనలు తెలియజేశారు. ఈ నియామకాన్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సెంట్రల్ కమిటీ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆమోదించారు…
