క్రీడలతో యువతకు మానసిక ఆరోగ్యంతో పాటు వికాసం పొందవచ్చని ఎంపిపి మహాసముద్రం హేమలత రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెనుమూరు మండలంలోని పర్యాటక కేంద్రమైన శ్రీ పులిగుంటేశ్వర స్వామి ఆలయం వద్ద గత 10 రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో ఆదివారం ఫైనల్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ప్రతి సంక్రాంతికి పులిగుండు వద్ద మహాసముద్రం ఫౌండేషన్ మరియు మహాసముద్రం దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం జరిగిన ఈ టోర్నమెంట్లో పులిగుండు టీం విజేత కాగా చిత్తూరు శీతమ్స్ కళాశాల జట్టు రన్నర్స్ గా నిలిచింది. చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర రెడ్డి, శ్రీ పులి గుంటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ మహాసముద్రం ప్రతాప రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మహాసముద్రం సురేష్ రెడ్డిలు విన్నర్స్ కు రూ. 30 వేలు, రన్నర్స్ కు రూ 15 వేలు నగదు బహుమతుల అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మునిరత్నం రెడ్డి, షణ్ముగం రెడ్డి , కేసులు రెడ్డి, చంద్రారెడ్డి, అంజిరెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి, రామకృష్ణాపురం మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, అందం ముని, గవర్నమెంట్ నిర్వాహకులు మహాసముద్రం దీపు రెడ్డి, వి. హేమచంద్ర, జి. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో యువతకు మానసిక ఆరోగ్యం
