Latest Posts

మహిళా అభ్యున్నతికి ఎనలేని కృషి.. తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే…

అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర శాఖ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం కళాశాల ప్రిన్సిపల్ ఆదినారాయణ ఆధ్వర్యంలో భారతీయ సంఘసంస్కర్త, మహిళల హక్కుల అభ్యున్నతికి ఎన లేని సేవలు అందించిన తొలి మహిళా సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ ఆదినారాయణ మాట్లాడుతూ నేటి బాలికలే రేపటి మహిళలు, మహిళ అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించిన మహాత్మ జ్యోతిరావు పూలే అర్ధాంగి సావిత్రిబాయి పూలే క్రీ. శ.1831 సంవత్సరంలో సతారా జిల్లాలో నయాగవ్ జన్మించి 1848 సంవత్సరంలో పూణేలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారని కొనియాడారు. అనంతరం రాజనీతి శాస్త్ర అధ్యాపకులు సిరాజ్ అలీఖాన్ , మాట్లాడుతూ 1890,1896 వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా జనజీవన స్రవంతి కరువుతో అతలాకుతలంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో మహిళా సేవ మండల్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించి బాధిత కుటుంబాలను ఆదుకున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎకనామిక్స్ అధ్యాపకులు అయ్యన్న మాట్లాడుతూ నేటి మహిళలకు సావిత్రిబాయి పూలే ఎంతో ఆదర్శమని నేటి విద్యార్థినులు మహిళలు తొలి ఉపాధ్యాయురాలుగా, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆమె సేవలు నీరాజనం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చరిత్ర శాస్త్ర అధ్యాపకులు రమేష్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor